కబడ్డీ చాంపియన్ మహబూబ్‌నగర్
- రాష్ట్ర స్థాయి సీనియర్ చాంపియన్‌షిప్
మహబూబ్‌నగర్ టౌన్: రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నీలో మహబూబ్‌నగర్ జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో బుధవారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మహబూబ్‌నగర్ 54-51 తేడాతో రంగారెడ్డిపై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఫైనల్లో ఇరు జట్ల ప్లేయర్లు ప్రతిభ చాటారు. విజేతగా నిలిచిన మహబూబ్‌నగర్ జట్టుకు రూ.75 వేలు, రన్నరప్ రంగారెడ్డికి రూ.50వేలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన వరంగల్, నల్లగొండ జట్లకు చెరో రూ.25 వేల చొప్పున నగదు బహుమతి అందించారు. అంతకుముందు క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సతీమణి శారద, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీశ్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత విజేతలకు బహుమతులు అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

