IAS Tranfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 10 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా నియమించారు.
– ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌కు ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలను కూడా ఆయనే నిర్వర్తించనున్నారు.
– ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా దివ్యకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
– జీహెచ్ఎంసీని మూడు విభాగాలుగా విభజించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగనున్నారు. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజన, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా టి.వినయ్ కృష్ణారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
– ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా పి.కాత్యాయని దేవిని నియమించారు. మయాంక్ మిట్టల్‌ను జలమండలి ఈడీ నుంచి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
– ఐటీ, పరిశ్రమలు & శాసన వ్యవహారాల శాఖ మంత్రికి ఓఎస్డీగా ఉన్న రఘురాం శర్మను పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. అలాగే ఓఎస్డీగా ఆయనే అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు.