ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజక్టు 5 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు స్థిరంగా వస్తున్న వరద శనివారం సాయం త్రానికి 68 వేల క్యూసెక్కులు నమోదయ్యింది. దీంతో 5 గేట్ల ద్వారా 20, 840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 773, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 44,931 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.
ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 4.718 మి.యూ ఉత్పత్తి జరుగగా ఇప్పటివరకు మొత్తంగా 232.589 మి.యూ ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాలలో 6 యూనిట్ల ద్వారా 4.605 మి.యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 258.520 మి.యూ విద్యుతుత్పత్తి జరిగింది. ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా సాయం త్రానికి 9.459 టీఎంసీలు నమోదయ్యింది. ప్రాజక్టు నుంచి 68,374 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది.