న్యూఢిల్లీ: జూనియర్ డేవిస్‌కప్‌లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. ఆసియా/ఓషియానా ఫైనల్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత్ 2-1తో జపాన్‌పై అద్భుత విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో భూషన్ 3-6, 6-3, 2-6తో హోండా చేతిలో ఓటమిపాలయ్యాడు. మరో సింగిల్స్‌లో రుషిల్ 6-3, 3-6, 6-0తో తోమిడాపై గెలిచి భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. డబుల్స్‌లో భారత ద్వయం భూషన్ , రుషిల్ 6-3, 6-4తో జపాన్ జోడీపై గెలిచింది.