ఓక్లాండ్: జూన్టీన్త్ సంబరాల్లో హింస చెలరేగింది. కాలిఫోర్నియాలోని(California) ఓక్లాండ్లో వేడుకలు జరుగుతున్న సమయంలో గొడవ ప్రారంభమైంది. లేక్ మీరిట్ వద్ద వీధుల్లో జరిగిన ఘర్షణలో 15 మందిపై కాల్పులు జరిగాయి. అయితే అనేక మంది గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు ఓక్లాండ్ పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటనలో ఎవరూ మరణించలేదు. ఎవర్నీ అరెస్టు చేయలేదు. బాధితులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటారని భావిస్తున్నారు. కాల్పుల సమయంలో జనం పరుగులు తీశారు. బాంబు విస్పోటనం సమయంలో తలదాచుకునేందుకు ప్రయత్నించారు. జూన్టీన్త్ సంబరాల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో జనం లేక్ మెరిట్ వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. గ్రాండ్ అవెన్యూ, బెల్లివ్యూ అవెన్యూ మధ్య గొడవ మొదలై ఆ తర్వాత కాల్పులకు దారి తీసింది.