Coca Cola | న్యూఢిల్లీ, డిసెంబర్ 11: గ్లోబల్ బేవరేజ్ దిగ్గజం కోకా-కోలా.. తమ భారతీయ బాట్లింగ్ వ్యాపార విభాగం హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్‌సీసీబీఎల్)లో 40 శాతం వాటాను జుబిలెంట్ భారతీయ గ్రూప్‌నకు అమ్మేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.10,000 కోట్లని తెలుస్తుండగా, జుబిలెంట్ బేవరేజెస్ లిమిటెడ్ కొంటున్నది. కాగా, హెచ్సీసీబీఎల్కు దేశవ్యాప్తంగా 13 ఫ్యాక్టరీలున్నాయి.
8 బ్రాండ్లలో 37 రకాల ఉత్పత్తులను తయారు చేసి అమ్ముతున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా కోకా-కోలాకు భారత్ ఐదో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్నది. ఈ లావాదేవీ ద్వారా వచ్చే నిధులను దేశీయంగా హెచ్‌సీసీబీఎల్ మార్కెట్ బలోపేతానికి కోకా-కోలా వాడుకోబోతున్నట్టు సమాచారం. ఈ లావాదేవీకి రెగ్యులేటర్ల అనుమతులు రావాల్సి ఉన్నది. మరోవైపు జుబిలెంట్ భారతీయ గ్రూప్ కొత్త సంస్థే ఈ జుబిలెంట్ బేవరేజెస్ లిమిటెడ్.