సెలబ్రిటిలకు సంబంధించి ఏ చిన్నవార్త అయినా సన్సేషనే..సోషల్ మీడియా ఫోకస్ అంతా ఎప్పుడూ సెలబ్రిటిల మీదే వుంటుంది. అందునా సినిమా తారలు, సినీ ప్రముఖులకు సంబంధించి ఏదైనా సన్సేషనే…ఒక్కొసారి కొంత మంది సృష్టించే న్యూస్ వాళ్ల సినిమా తారలు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు.
ముఖ్యంగా సినీ తారల హెల్త్ అప్డేట్స్ గురించి కూడా ఒక్కొసారి వచ్చే రాంగ్ న్యూస్ వాళ్లను ఎంతో కలవర పెడుతుంది. అయితే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యాడని.. హాస్పటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై వెంటనే స్పందించి జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. రెండు రోజుల క్రితం జిమ్ చేస్తుండగా… తన చేయి బెణికిందని.. అంతకు మించి తనకు ఏమీ కాలేదని… అభిమానులు, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ ఆ నోట్లో తెలియజేశారు. అయితే ఈ క్లారిఫికేషన్‌తో కొంత మంది సంతృప్తి చెందలేదు.
ఎన్టీఆర్ షూటింగ్లో గాయపడ్డాడని.. ఇంకా హాస్పిటల్లోనే వున్నాడని కొంతమంది మళ్లీ ప్రచారం చేశారు. అయితే తాజాగా శనివారం ఎన్టీఆర్ తన బావమరిది నటించిన ‘ఆయ్’ చిత్రం టీమ్‌ను తన ఆఫీసుకు పిలిపించుకుని వారిని అభినందించి.. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మీడియాకు వదిలారు. ఎన్టీఆర్ కలిసిన వారిలో హీరో నార్నే నితిన్, అంకిత్ కొయ్య, సారికతో పాటు నిర్మాత బన్నీవాస్, ఎస్కెఎన్, దర్శకుడు అంజి తదితరులు కూడా వున్నారు. అంతేకాదు ఈసినిమాకు వస్తున్న పాజిటవ్ రెస్పాన్స్‌కు వాళ్లకు ఆల్‌దిబెస్ట్ చెప్పారు ఎన్టీఆర్.
ఇక తారక్ లాంటి స్టార్హీరో పిలిచి తమను అభినందించే సరికి ఆయ్ టీమ్ కూడా ఎంతో సంతోషంగా వుంది. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం మరొకటి వుంది. తన యాక్సిడెంట్‌పై వస్తున్న వార్తలకు, తన ప్రమాద తీవ్రతపై వస్తున్న గాసిప్స్‌కు కూడా ఎన్టీఆర్ ఈ అభినందనతో చెక్ పెట్టేశాడు. ఇక ఎన్టీఆర్ కేవలం చేతికి ఓ చిన్నకట్టుతో కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చేసరికి ఎన్టీఆర్ అభిమానులు కూడా మా హీరో సూపర్‌గా వున్నాడు.. అంటూ సంతోషపడతున్నారు. అంతేకాదు ఇలా పరోక్షంగా చెప్పడానికే ఎన్టీఆర్ ఈ అకేషన్‌ను కూడా యూజ్ చేసుకున్నాడని అంటున్నారు మరికొంత మంది.