బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలంలోని అలియాబాద్ గ్రామంలో 150 మంది, మజీద్‌పూర్ గ్రామంలో 120 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అభివృద్ధికి ఆకర్షితులై చేరికలు..
ముమ్మరంగా పార్టీ శ్రేణుల ప్రచారం
బీఆర్ఎస్కే జై కొడుతున్న జనం
శామీర్‌పేట, నవంబర్ 17: బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలంలోని అలియాబాద్ గ్రామంలో 150 మంది, మజీద్‌పూర్ గ్రామంలో 120 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన మేనిఫెస్టో ప్రజాదరణ పొందుతుందన్నారు.
అలియాబాద్ గ్రామంలో తాళ్ల జగదీశ్‌గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడు రవీందర్, శ్రీకాంత్‌గౌడ్, సాయిబాబు, ఎన్నమైన సాయి, సొప్పరి శ్రీకాంత్, సత్యనారాయణ, నాని, విజయ్, శ్రీకాంత్‌లతో పాటు 150 మంది, అదే విధంగా మజీద్‌పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి సుమారు 120 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి వారికి కండువాకప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పం చ్‌లు మోహన్‌రెడ్డి, కుమార్‌యాదవ్, ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ళ జగదీశ్‌గౌడ్, గ్రామీణ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్‌రెడ్డి, వార్డు సభ్యులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
అభివృద్ధి, పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయి
మేడ్చల్ రూరల్: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని బీఆర్ఎస్ నియోకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మండల నాయకుడు భాగ్యారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మేడ్చల్ మండలంలోని కోనాయిపల్లి గ్రామానికి చెందిన 40 మంది శివాజీ యువజన సంఘ సభ్యులు మహేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని, అదే మల్లారెడ్డి గెలుపునకు దోహద పడుతుందని అన్నారు.
ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మేడ్చల్‌లో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు విజయానందరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, సర్పంచ్ శేఖర్, డబిల్పూర్ పీఏసీఎస్ చైర్మన్ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాజమల్లారెడ్డి, బలరాంరెడ్డి, రఘుపతిరెడ్డి, సుదర్శన్, కుమార్, దీపక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.