గద్వాల అర్బన్, సెప్టెంబర్ 12 : జోగుళాంబ గద్వాల జిల్లా రేపల్లిలో కులాంతర వివాహం చేసుకున్నాడని దళిత యువకుడి ఇల్లు నేలమట్టం చేసిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇల్లు కూల్చివేత ఘటనలో నిందితులుగా ఉన్న పరశురాముడు, వీరన్న, వెంకటేశ్, పరశురాముడు, రామాంజనేయులు, గోపాల్, తిమ్మన్నపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
శనివారం కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. ఇంటి కూల్చివేతకు ఉపయోగించిన ట్రాక్టర్తోపాటు గడ్డపారలను సీజ్ చేశారు.