న్యూఢిల్లీ: ఢిల్లీలోని జేఎన్‌యూ వర్సిటీలో ఆదివారం రెండు స్టూడెంట్స్ యూనియన్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ జేఎన్‌యూ రిజిస్ట్రార్ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. విద్యార్థులు ఎటువంటి గొడవకు దిగవద్దు అని ఆయన తన లేఖలో వార్నింగ్ ఇచ్చారు. వర్సిటీలో శాంతికి భంగం కలిగితే సహించబోమన్నారు. క్యాంపస్‌లో హింసను ఎట్టిపరిస్థితుల్లో సహించేదిలేదని వీసీ చెప్పారని ఆ లేఖలో రిజిస్ట్రార్ తెలిపారు. యూనివర్సిటీలోని ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సంఘాల విద్యార్థుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. తామేమీ నాన్ వెజ్ ఫుడ్‌కు వ్యతిరేకం కాదు అని, హాస్టల్ల ఏదైనా తినవచ్చు అని, కానీ శ్రీరామనవమి పూజను నిర్వహిస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదు అని జేఎన్‌యూ ఏబీవీపీ అధ్యక్షుడు రోహిత్ యాదవ్ తెలిపారు. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్, ఏఐఎస్ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని ఏబీవీపీ విద్యార్తులపై కేసు బుక్ చేశారు.