వాట్సాప్‌తో జియోమార్ట్ సరుకులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: వాట్సాప్ చేస్తే చాలు.. కిరాణా, కూరగాయలు, ఇతర నిత్యవసరాల్ని సరఫరా చేసేందుకు జియోమార్ట్ సిద్ధం. బిలియనీర్ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్ ఈ సదుపాయాన్ని ప్రారంభించనుంది. వాట్సాప్ ద్వారా సరుకుల్ని ఆర్డర్ చేసే విధానాన్ని బుధవారం మెటా (గతంలో ఫేస్బుక్) నిర్వహించిన కార్యక్రమంలో ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీలు ప్రదర్శించారు. ‘ట్యాప్ అండ్ ఛాట్’ ఆప్షన్ నుంచి వాట్సాప్ ద్వారా వినియోగదారులు ఆర్డర్ చేయవచ్చు. డెలివరీ ఉచితం కాగా, ఆర్డర్ కనీస విలువపై పరిమితి లేదు. కస్టమర్లు యాప్‌లో వారి ఆర్డర్‌ను ఇచ్చి వయా జియోమార్ట్‌కు లేదా డెలివరీ తర్వాత నగదును చెల్లింపులు చేయవచ్చు.
వాట్సాప్‌తో జియో రీచార్జ్
త్వరలో జియో యూజర్లు వాట్సాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు రిలయన్స్ జియో, మెటాలు ప్రకటించాయి. 2022లో ప్రవేశపెట్టే ఈ ఫీచర్‌తో రీచార్జ్ ప్రక్రియ సరళంగా ఉంటుందని, ముఖ్యంగా వృద్ధులకు ఉపయోగకరమని జియో ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్లు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీలు చెప్పారు.
రూపాయికే జియో రీచార్జ్
రిలయన్స్ జియో ఒక వినూత్న ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్క రూపాయితో రీచార్జ్ చేసుకుని 30 రోజుల వ్యాలిడిటీతో 100 ఎంబీ డాటాను పొందవచ్చు. డాటా పరిమితి ముగిస్తే స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుందని జియో తెలిపింది. మైజియో యాప్‌లోనే ఈ సదుపాయం లభిస్తుంది. ఆ యాప్‌లో ‘అదర్స్’లో వాల్యూ అనే సెక్షన్‌ను ఓపెన్ చేస్తే రూపాయి ప్యాక్ కన్పిస్తుంది. యూజర్లు 500 ఎంబీ డాటా కావాలంటే ఐదుసార్లు, 1 జీబీ డాటా కావాలంటే పదిసార్లు రీచార్జ్ చేసుకోవాలి. గరిష్ఠంగా ఎన్నిసార్లు రీచార్జ్ చేసుకోవొచ్చన్న అంశంపై స్పష్టత లేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

