Reliance Jio | న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే టారిఫ్ చార్జీలు పెంచి వినియోగదారులకు షాకిచ్చిన జియో..ఈసారి మాత్రం చౌకైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 98 రోజుల కాలపరిమితితో రూ.999 ప్లాన్‌ను తెచ్చింది.
ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోజుకు 2 జీబీ డాటా చొప్పున 196 జీబీల డాటాను పొందవచ్చును. ఈ డాటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్కి పడిపోనున్నది. ప్రస్తుతం సంస్థకు 49 కోట్ల మంది మొబైల్ కస్టమర్లు ఉన్నారు.