అండర్‌గార్మెంట్స్ కొనేందుకు ఢిల్లీ వెళ్లా : ఎమ్మెల్యే సోరెన్
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోదరుడు ఎమ్మెల్యే బసంత్ సోరెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుమ్కా నియోజకవర్గానికి చెందిన బసంత్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అయితే ఒకవైపు దుమ్కాలో ఇద్దరు అమ్మాయిల రేప్, మర్డర్ ఘటనలతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఢిల్లీ ఎందుకు వెళ్లారని ఓ విలేఖరి ప్రశ్న అడిగారు. ఆ సమయంలో ఎమ్మెల్యే బసంత్ సోరెన్ సమాధానం ఇస్తూ.. అండర్ గార్మెంట్స్ కొనేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు చెప్పారు. వాటిని తాను అక్కడే కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉన్నా.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. అండర్ గార్మెంట్స్ కొనేందుకు ఢిల్లీ వెళ్లినట్లు చెప్పిన సోరెన్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. పేదలు, గిరిజన ప్రజల నేత శిబూ సోరెన్ కుమారుడు లోదుస్తులు కొనేందుకు ఢిల్లీ వెళ్లారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ట్వీట్ చేశారు. అందుకే దుమ్కా ఎమ్మెల్యే బాధితుల్ని కలుసుకోవడం లేదని ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

