హైదరాబాద్, అక్టోబర్ 6: ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్..నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి సమంత రూత్ ప్రభును నియమించుకున్నది. ఈ సందర్భంగా జోయాలుక్కాస్ గ్రూపు చైర్మన్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ..సమంత నేటి మహిళ ఆత్మవిశ్వాసం, శైలి, ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబించనున్నారని, ఆమెను జోయాలుక్కాస్ కుటుంబంలోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు.
అలాగే సమంత మాట్లాడుతూ..ఆభరణాలు ఎల్లప్పుడూ నా వ్యక్తిగత శైలిని తెలియచేజే మార్గంగా భావిస్తాను..ప్రతి ఆభరణం వెనుక ఎన్నో భావోద్వేగాలు, వేడుకలు, ధైర్యం వంటి లక్షణాలు జోయాలుక్కాస్‌లో ఉన్నాయి..అందానికి ప్రాధాన్యతనిచ్చే ప్రతి మహిళను ఆత్మవిశ్వాసంతో ప్రకాశించేలా ప్రోత్సహించే బ్రాండ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.