Naresh Goyal | జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని సెప్టెంబర్ 14 వరకు పొడిగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో గోయల్‌ను ఈడీ కోర్టులో హాజరుపరిచింది. దర్యాప్తునకు నరేశ్ గోయల్ సహకరించడం లేదంటూ ఈడీ మరో నాలుగు రోజులు గడువును కోరింది. ఈ మేరకు కోర్టును అనుమతి ఇచ్చింది. కెనరా బ్యాంక్‌లో రూ.538కోట్ల మోసం కేసులో ఈడీ నరేశ్ గోయల్‌తో పాటు ఆయన భార్య అనిత, పలువురు కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌లపై సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు ఈడీ మనీలాండింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేశ్‌తో గోయల్‌తో పాటు పలువురికి సంబంధించి ఇండ్లు, కార్యాలయాల్లో జులైలో ఈడీ దాడులు నిర్వహించింది.
అయితే, విచారణ సందర్భంగా నరేశ్ గోయల్ తరఫు న్యాయవాది అబాద్ పొండా మాట్లాడేందుకు కోర్టు అనుమతిని అభ్యర్థించారు. ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు తెలిపారు. తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారని, కస్టడీ సమయంలో నిద్రపోకుండా ఈడీ నిర్బంధించిందని పేర్కొన్నారు. ఆయన చర్య సమస్యలు, గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ అయ్యింది.. వెన్ను సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. మంచంపైనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే తన భార్య క్యాన్సర్‌కు చికిత్స పొందుతుందని, ఆమెతో ఫోన్లో మాట్లాడేందుకు అనుమతించాలని కోర్టును అభ్యర్థించారు.
అలాగే ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన ఆయన.. కోర్టులో ఉద్వేగానికి గురయ్యారు. ‘నాకేం తెలియదు. ఈడీకి చెప్పేందుకు నావద్ద ఇంకేం సమాచారం లేదు. నేను తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. నొప్పులు భరించలేకపోతున్నాను. నా శరీరం సహకరించడం లేదు’ అని పేర్కొంది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ రిపోర్టును ఈడీ కోర్టుకు అందజేసింది. అవసరమైతే ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోర్టు ఆదేశించగా.. అవసరమైతే ప్రభుత్వా ఆసుపత్రికి తీసుకెళ్తామని ఈడీ తెలిపింది. ఈ సందర్భంగా నరేశ్ గోయల్ తరఫున న్యాయవాదులు బెడ్‌తో పాటు మందులు, వైద్య సమస్యలు, కుటుంబ సభ్యులను కలిసేందుకు దరఖాస్తులను కోర్టులో దాఖలు చేశారు. అయితే, కొన్ని ప్రాథమిక అవసరాలను మాత్రం సమకూర్చగలమని, కానీ నిర్ధిష్ట అభ్యర్థలను తీర్చలేమని ఈడీ తరఫున న్యాయవాది తెలిపారు.