జూలై 5న అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్న జెఫ్ బెజోస్
జూలై 5న అమెజాన్ సీఈఓ పదవి తప్పుకోనున్న జెఫ్ బెజోస్ | అమెజాన్ సీఈఓగా పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోనున్నారు. జూలై 5 నుంచి బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.

వాషింగ్టన్ : అమెజాన్ సీఈఓగా పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోనున్నారు. జూలై 5 నుంచి బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. బుధవారం జరిగిన అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘ఆ రోజుకు సరిగ్గా 27 ఏళ్ల క్రితం.. అంటే 1994లో అమెజాన్ సంస్థ ప్రారంభమైంది. అందుకే జూలై 5 నాకు ఎంతో ప్రత్యేకమైంది’ అని తెలిపారు. అయితే, కొత్త సీఈవో ఏ రోజున బాధ్యతలు చేపడతారన్న వివరాలు మాత్రం చెప్పలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించినా.. తేదీని మాత్రం వెల్లడించలేదు.
బెజోస్ స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ ఆండీ జెస్సీ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపడుతారని అమెజాన్ ప్రకటించింది. బెజోస్ సీఈఓ పదవి నుంచి వైదొలగినా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. అమెజాన్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్‌షిప్, అమెజాన్ డే1 ఫండ్2పై మరింత దృష్టి సారించేందుకే సీఈఓ పదవి నుంచి ఆయన వైదొలగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బుధవారం అమెజాన్ కీలక ప్రకటన చేసింది. హాలీవుడ్ స్టూడియో ఎంజీఎంను 8.34 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. మరిన్ని షోలు, సినిమాలతో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌ను యూజర్లకు అందజేస్తామని పేర్కొంది.
బెజోస్ 1994లో అమెజాస్‌ను స్థాపించారు. ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మెందుకు ఈ సంస్థను ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం అమెజాన్ ఆస్తుల విలువ 1.67 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి
మెహుల్ చోక్సీ దొరికాడు..
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
బాదుడే బాదుడు.. 14వసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాలి.. ఇంటెలిజెన్స్‌కు బైడెన్ ఆదేశం
దేశంలో 24 గంటల్లో 2.11లక్షల కరోనా కేసులు
సరయూ నదిలో తేలిన మృతదేహాలు
హనుమాన్ జన్మస్థలంపై తిరుమలలో ప్రారంభమైన చర్చలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

