తొలి సినిమా ‘శివ’లోని తన పాత్ర పేరును ఇంటిపేరుగా మార్చుకున్నారు జేడీ చక్రవర్తి. మనీ, గులాబీ, అనగనగా ఒక రోజు, ఎగిరేపావురమా, ప్రేమకు వేళాయరా వంటి ఘన విజయాలను చవిచూసిన ఆయన.. బాలీవుడ్ క్లాసిక్ ‘సత్య’తో ఉత్తరాది ప్రేక్షకుల్ని సైతం మెప్పించారు. ప్రస్తుతం ‘గాయపడ్డ సింహం’ చిత్రంతో ప్రతినాయకుడు ట్రబుల్ ధర్మాగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తరుణ్‌భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. కల్యాణచక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతాప్, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మాతలు. మే 1న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు జేడీ చక్రవర్తి.