ఈ కథలో అందరూ గాయపడ్డ సింహాలే..
తొలి సినిమా ‘శివ’లోని తన పాత్ర పేరును ఇంటిపేరుగా మార్చుకున్నారు జేడీ చక్రవర్తి. మనీ, గులాబీ, అనగనగా ఒక రోజు, ఎగిరేపావురమా, ప్రేమకు వేళాయరా వంటి ఘన విజయాలను చవిచూసిన ఆయన.. బాలీవుడ్ క్లాసిక్ ‘సత్య’తో ఉత్తరాది ప్రేక్షకుల్ని సైతం మెప్పించారు.
తొలి సినిమా ‘శివ’లోని తన పాత్ర పేరును ఇంటిపేరుగా మార్చుకున్నారు జేడీ చక్రవర్తి. మనీ, గులాబీ, అనగనగా ఒక రోజు, ఎగిరేపావురమా, ప్రేమకు వేళాయరా వంటి ఘన విజయాలను చవిచూసిన ఆయన.. బాలీవుడ్ క్లాసిక్ ‘సత్య’తో ఉత్తరాది ప్రేక్షకుల్ని సైతం మెప్పించారు. ప్రస్తుతం ‘గాయపడ్డ సింహం’ చిత్రంతో ప్రతినాయకుడు ట్రబుల్ ధర్మాగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తరుణ్‌భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. కల్యాణచక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతాప్, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మాతలు. మే 1న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు జేడీ చక్రవర్తి.
- నటుడిలోని ఉత్సాహాన్ని సవాలుతో కూడుకున్న పాత్రలు రెట్టిపు చేస్తాయి. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన కమల్‌హాసన్‌కి కూడా దొరకని పాత్ర నాకు దొరికింది. ఇన్నాళ్లూ ఫస్ట్‌హాఫ్‌లో ఒకలా, సెకండాఫ్‌లో ఒకలా ప్రవర్తించే పాత్రల్ని చూశాం. కానీ ఈ పాత్ర ఆద్యంతం రెండు రకాలుగా ప్రవర్తిస్తుంది. అలా చేయడానికి కష్టపడ్డానని చెప్పను. కథలోని బలం, మ్యాజిక్ వల్ల అలా కుదిరింది.
- ఇందులో అందరూ గాయపడ్డ సింహాలే. అయితే ఎక్కువ గాయాలైన సింహం తరుణ్‌భాస్కర్. నాతోపాటు, మరో సింహానికి కూడా గాయాలయ్యాయి. ఆ సింహం ఎవరో త్వరలో రివీల్ చేస్తాం. ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు ట్రబుల్ ధర్మా, తరుణ్‌భాస్కర్ పేరు దరహాస్, ఇంకో చిత్రమైన పాత్ర ఉంటుంది. ఇవన్నీ కలిసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది.
- దర్శకుడు కశ్యప్ మేకింగ్ ైస్టెల్ నాకు నచ్చింది. డిఫరెంట్‌గా, రియలిస్టిక్‌గా, హిలేరియస్‌గా సినిమా తీశాడు. ఇందులో నాతోపాటు చాలామంది డైరెక్టర్లు నటించారు. కానీ కశ్యప్ ఏమనుకుంటే అదే తీశాడు. మేం కూడా ఇన్పుట్స్ ఇవ్వలేదు. చెప్పింది చేశాం. అలాగే ఈ సినిమాకు టెక్నికల్‌గా మంచి టీమ్ కుదిరింది. నాకు నటన అంటే ఇష్టం. హీరో, విలన్ అని బేరీజు వేసుకోను. కథ నచ్చితే చేస్తా. ఇందులో నేను పోషించిన ధర్మా పాత్ర అందరికీ నచ్చుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

