చిన్ననాటి అందమైన జ్ఞాపకాలను గుర్తుచేసే కథతో రూపొందిస్తున్న బాలల చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. మాస్టర్ రోహన్, అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ అమ్మమ్మ సుశీలమ్మగా కీలక పాత్రలో కనిపించనుంది. బుధవారం ఆమె క్యారెక్టర్ తాలూకు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మగా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటుందని మేకర్స్ తెలిపారు. రాజీవ్ కనకాల, వాసుకి, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సింజిత్ యెర్రమల్లి, కథ, దర్శకత్వం: శ్రీకర్.