Janhvi Kapoor|అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ ఆనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఆ తర్వాత వైవిధ్యమైన సినమాలు చేసుకుంటూ వెళుతుంది. ముఖ్యంగా ఛాలెంజింగ్ రోల్స్‌లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. ఇక తెలుగులో జాన్వీ ఎప్పుడు ఆరంగేట్రం చేస్తుందా అని అందరు ఎదురు చూడగా, గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర : పార్ట్ 1తో ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ‘సుందరి’ అనే చిత్రంలోనూ నటిస్తున్నది.
అయితే జాన్వీ కపూర్ డేటింగ్‌కి సంబంధించిన వార్తలు ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఈ అమ్మడు చాలా మందితోనే డేటింగ్ చేసింది. సినిమాలలోకి రాకముందు గామన్ ఇండియా ఛైర్మన్ కొడుకు అక్షత్ రాజన్‌తో డేటింగ్ చేసింది. కొన్నాళ్లకి బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇక 2018లో ధడక్ సినిమా చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ ప్రేమలో పడ్డారట. వీరిద్దరు చాలాసార్లు కలిసి కనిపించారు. ఏడాది తర్వాత 2018లో బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇక దోస్తానా 2 సినిమా చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడించిందనే ప్రచారం జరిగింది.
అయితే ఏదో కారణం చేత వారి రిలేషన్ బ్రేకప్ అయిందట. ఇక 2022లో జాన్వీ కపూర్, తన స్కూల్ క్లాస్మేట్ శిఖర్ పహారియాతో మళ్లీ స్నేహం మొదలుపెట్టింది. పెళ్లిళ్లు, ఫ్యామిలీ గెట్-టుగెదర్స్లో కలిసి కనిపించారు. కానీ, రిలేషన్‌షిప్‌ను బయటపెట్టలేదు. ప్రస్తుతం అతనితోనే పీకల్లోతు ప్రేమలో ఉందంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో వాస్తవం ఉందన్నది తెలియదు కాని త్వరలో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారట.