రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉప్పలయ్యగౌడ్
పాలకుర్తి, మార్చి 30: గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తాళ్లపల్లి ఉప్పలయ్య గౌడ్ ను నియమించారు. ఈ మేరకు ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు యెలికట్టి విజయకుమార్గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూల వెంకటేశ్వర్లుగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప్పలయ్యగౌడ్ మా ట్లాడు తూ గీత కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం ఉప్పలయ్యగౌడ్ను సంఘం రాష్ట్ర కార్యదర్శి కమ్మగాని పరమేశ్వర్గౌడ్, కార్యనిర్వహణ కార్యదర్శి గిరగాని సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు తాళ్ల సోమనారాయణ, ఉపాధ్యక్షుడు పులి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి వంగ వేణు, జిల్లా ప్రచార కార్యదర్శి దామోదర్ అభినందించారు.