జానారెడ్డి ఇక గతం మాత్రమే : మంత్రి జగదీశ్ రెడ్డి
జానారెడ్డి ఇక గతం మాత్రమే | నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి ఇక గతం మాత్రమే. ఇన్నాళ్లు దీటైన నాయకుడు లేక గెలుస్తూ వచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

నల్లగొండ : ‘నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి ఇక గతం మాత్రమే. ఇన్నాళ్లు దీటైన నాయకుడు లేక గెలుస్తూ వచ్చారు.
ఆయన తన రాజకీయ జీవితంలో నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారు. ప్రజలకు తాగేందుకు గుక్కెడు నీళ్లు సైతం ఇవ్వలేక పోయారు.
ఆయన హయాంలో సాగర్ ఎడమ కాలువ కింద మొట్టమొదటి రాజవరం మేజర్‌కే సాగునీళ్లు రాలేదు’ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ నామినేషన్‌కు దాఖలు కార్యక్రమానికి హాజరైన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు.
యువకుడు, విద్యావంతుడు భగత్‌ను ఆశీర్వదించి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధిలో పరుగులు పెట్టిందని అన్నారు.
జానారెడ్డి సవాలు గమ్మతుగా ఉందని.. నామినేషన్ వేసి ప్రచారం చేయకుండా ఎవరి ఇంట్లో వారే ఉందాం అని అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
‘జానారెడ్డి చేసింది.. చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో ప్రచారం వద్దని అంటున్నారు. జానారెడ్డి మాటల్లో ఓటమి భయం కనపిస్తుంది.
ఈ ఎన్నికల్లో 2018 ఎన్నికల ఫలితం పునరావృతం ఖాయం. ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. వ్యవసాయం పండుగలా మారింది’ అని మంతి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సాగర్ ఉపఎన్నిక : ముగిసిన నామినేషన్ల పర్వం
టీఆర్ఎస్లోకి బీజేపీ నేత కడారి అంజయ్య?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

