Sanjay Singh : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తొలి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) కి ఎదురుదెబ్బ తగిలింది. ముంగేర్ అసెంబ్లీ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ టికెట్ దక్కించుకున్న ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ షాకిచ్చారు. ఆయన ఊహించని రీతిలో పోలింగ్‌కు కేవలం ఒక్కరోజు ముందు జేఎస్పీకి బైబై చెప్పి.. బీజేపీలోకి జంప్ అయ్యారు.
ముంగేర్ బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. దాంతో ముంగేర్ అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోరు అనుకుంటే అది ద్విముఖ పోరుగా మారింది. ఇప్పుడు ప్రధాన కూటములు అయిన ఎన్డీయే, మహాగఠ్‌బంధన్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది.