Early Dinner | పూర్వం ప్రజలు రోజూ శారీరక శ్రమ చేసే వారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండేవారు. రోజూ బలవర్ధకమైన ఆహారం తినేవారు. అంతేకాదు రాత్రి పూట త్వరగా భోజనం చేసేవారు. త్వరగా నిద్రించేవారు. ఉదయం త్వరగా నిద్రలేచేవారు. ఇలా అన్ని రకాలుగా వారు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించేవారు. కనుకనే ఎన్నో ఏళ్ల పాటు వారు ఆరోగ్యంగా జీవించగలిగారు. అయితే అప్పట్లో ప్రజలు అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పౌష్టికాహారం తీసుకోవడం మాత్రమే కాకుండా రాత్రి పూట త్వరగా భోజనం చేయడమే అని చెప్పవచ్చు. సైంటిస్టులు ఈ విషయంపై అధ్యయనాలు కూడా చేపట్టి వాస్తవమే అని తేల్చారు. ఈ క్రమంలోనే రాత్రి పూట త్వరగా భోజనం చేయాలని, దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సూచిస్తున్నారు.
రాత్రి పూట త్వరగా భోజనం చేయడం వల్ల అనేక వ్యాధులు, అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. భోజనాన్ని కనీసం రాత్రి 7.30 గంటల లోపు ముగించాల్సి ఉంటుంది. రాత్రి పూట త్వరగా భోజనం చేయడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా రాత్రి పూట త్వరగా భోజనం చేయాలి. దీని వల్ల మనం తిన్న ఆహారం నుంచి వచ్చే శక్తిని ఖర్చు పెట్టేందుకు శరీరానికి తగిన సమయం లభిస్తుంది. దీంతో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు తప్పనిసరిగా ఈ సూచనను పాటించాల్సి ఉంటుంది. రాత్రి పూట త్వరగా భోజనం చేయడం వల్ల శరీరంలో కొవ్వు అధికంగా చేరకుండా చూసుకోవచ్చని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. దీని వల్ల ఊబకాయం బారిన పడకుండా ఉంటారు.
రాత్రి పూట త్వరగా భోజనం చేయడం వల్ల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. రాత్రి పూట త్వరగా భోజనం చేస్తే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు. త్వరగా భోజనం ముగించే పురుషులకు 26 శాతం వరకు క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. అదే స్త్రీలకు అయితే 16 శాతం వరకు క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. రాత్రి త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రించడం వల్ల ఉదయం త్వరగా నిద్రలేస్తారు. దీని వల్ల నిద్రలేమి ఉండదు. పైగా ఉదయం నిద్ర లేచిన వెంటనే యాక్టివ్గా ఉన్నట్లు ఫీలవుతారు. శరీరానికి శక్తి లభించినట్లు ఉత్సాహం వస్తుంది. రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. యాక్టివ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. బద్దకం పోతుంది.
రాత్రి పూట త్వరగా భోజనం చేస్తే జీర్ణ వ్యవస్థకు కావల్సినంత విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయగలుగుతుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే అవయవాలు సులభంగా మరమ్మత్తులకు గురవుతాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్తి తగ్గుతాయి. అలాగే రాత్రి త్వరగా భోజనం చేస్తే నిద్రించే సమయానికి ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. రాత్రి పూట భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండాలని వైద్యులు చెబుతుంటారు. కనుక త్వరగా భోజనం చేయడం వల్ల నిద్రకు భంగం కలగదు. పైగా మరుసటి రోజు ఉదయం కూడా త్వరగా నిద్రలేస్తారు. ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుంది. ఇక రాత్రి పూట త్వరగా భోజనం చేసేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు సైతం చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. కనుక రాత్రి పూట త్వరగా భోజనం చేస్తుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.