జమ్మికుంట, ఏప్రిల్17: ఫేస్బుక్లో పరిచయమైన ఒంటరి మహిళ ను న్యూడ్ కాల్స్ చేయాలంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎస్సై లైంగికదాడికి పాల్పడ్డాడని హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జమ్మికుంట ఎస్సై కే శ్రీ కాంత్‌కు 2025లో హనుమకొండకు చెందిన ఓ మహిళతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. సదరు మహిళ ఒంటరిగా ఉంటున్నదని గ్రహించి, న్యూడ్‌కాల్స్ చేయాలంటూ ఎస్సై వే ధింపులకు పాల్పడ్డాడు. ఇటీవల వరంగల్‌కు వచ్చిన ఎస్సై శ్రీకాంత్ ఆమె ఇంటికి వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధిత మహి ళ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేశారు. ఎస్సై శ్రీకాంత్ గతంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో స స్పెండ్ అయ్యాడు. ఈ నెల మొదటి వారంలో జమ్మికుంట ఎస్సైగా బాధ్యతలు చేపట్టాడు.