Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Jamia Millia Islamia : న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. విద్యార్థులు మూడు ప్రధాన డిమాండ్లతో దీక్ష కొనసాగిస్తున్నారు.
Jamia Millia Islamia : న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. విద్యార్థులు మూడు ప్రధాన డిమాండ్లతో దీక్ష కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా నిర్వహించకుండా ఉన్న విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలి అనేది మొదటి, ప్రధాన డిమాండ్. యూనివర్సిటీకి చెందిన ఒక ఉన్నతాధికారిని తొలగించాలనేది రెండో డిమాండ్ కాగా.. నిరసన చేపట్టిన విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదు అనేది మూడో డిమాండ్.
ఈ మూడు డిమాండ్ల సాధన కోసం జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనిలో భాగంగా 14 రోజులుగా కొందరు విద్యార్థులు నిరాహార దీక్షకు దిగారు. వీరికి 100-150 మంది విద్యార్థులు సంఘీభావం తెలుపుతున్నారు. ఇదే సమయంలో యూనివర్సిటీకి చెందిన కొందరు ఉన్నతస్థాయి సిబ్బంది తమపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థి నేత ఫైజాన్ ఆరోపించారు. యూనివర్సిటీ సెక్యూరిటీ చీఫ్ విద్యార్థులపై అసభ్య పదజాలం ఉపయోగించారని ఫైజాన్ మండిపడ్డారు. దీంతో ఆయనను వెంటనే విధులనుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళనపై యూనివర్సిటీ పాలకవర్గం స్పందించింది. విద్యార్థి యూనియన్ డిమాండ్లను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థి యూనియన్‌కు సంబంధించి యూనివర్సిటీ రాజ్యాంగాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. అయితే, విద్యార్థులు తమ ఆందోళన విషయంలో వెనక్కు తగ్గడం లేదు. ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా సాగుతోంది. విద్యార్థులు, యూనివర్సిటీ నిర్వాహకుల మధ్య శనివారం ఘర్షణ తలెత్తింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
తరగతుల్ని ఆన్లైన్లో నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. అలాగే, లైబ్రరీని కూడా మూసేసింది. అలాగే, యూనివర్సిటీ క్యాంపస్‌లో పలు వివాదాస్పద స్లోగన్స్ కనిపించడం సంచలనంగా మారింది. కొందరు విద్యార్థుల్ని వివిధ కారణాలతో క్యాంపస్ హాస్టల్లోకి అనుమతించకపోవడంపై, యూనివర్సిటీలో వైద్య సేవలు సరిగ్గా అందించకపోవడంపై కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

