Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Health Tips | శుభ కార్యమైనా, చెడు కార్యమైనా.. ఫంక్షన్ చిన్నదైనా, పెద్దదైనా ఈ రోజుల్లో మద్యపానం (Alchohal Consumption) అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఏ ఫంక్షన్‌తో సంబంధం లేకుండా నిత్యం మద్యం సేవించే వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఈ మద్యాన్ని కొందరు నీళ్లు (Water) కలుపుకుని తాగితే, మరికొందరు మాత్రం థమ్సప్ (Thums UP), స్ప్రైట్ (Sprite), సోడా లాంటి కూల్ డ్రింక్స్ (Cool drinks) కలుపుకుని తాగుతుంటారు.
Health Tips : శుభ కార్యమైనా, చెడు కార్యమైనా.. ఫంక్షన్ చిన్నదైనా, పెద్దదైనా ఈ రోజుల్లో మద్యపానం (Alchohal Consumption) అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఏ ఫంక్షన్‌తో సంబంధం లేకుండా నిత్యం మద్యం సేవించే వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఈ మద్యాన్ని కొందరు నీళ్లు (Water) కలుపుకుని తాగితే, మరికొందరు మాత్రం థమ్సప్ (Thums UP), స్ప్రైట్ (Sprite), సోడా లాంటి కూల్ డ్రింక్స్ (Cool drinks) కలుపుకుని తాగుతుంటారు. ఈ అలవాటు సరదాగా అనిపించినా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంవల్ల తెలియకుండానే తీవ్రమైన అనారోగ్య సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుందని అంటున్నారు.
శీతల పానీయాలలో ఉండే కార్బన్ డయాక్సైడ్ను, అధిక మోతాదులో ఉండే చక్కెరలను, ఆల్కహాల్‌ను శరీరం చాలావేగంగా గ్రహించేలా చేస్తాయి. సాధారణంగా అయితే నెమ్మదిగా రక్తంలో కలిసే మద్యం, వీటితో కలిపి సేవించినప్పుడు నేరుగా రక్త ప్రవాహంలోకి వేగంగా చేరుతుంది. దీని ఫలితంగా తాగిన వ్యక్తి అనుకున్నదానికంటే చాలా త్వరగా మత్తులోకి జారుకుంటారు. ఇలా మద్యం వేగంగా శరీరంలోకి చేరడం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరిగి గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కూల్ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెరలవల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి చాలా ప్రమాదకరం.
ఆల్కహాల్‌కు సహజంగానే శరీరాన్ని డీహైడ్రేట్ (నిర్జలీకరణ) చేసే గుణం ఉంటుంది. దానికితోడు ఈ చక్కెర పానీయాలు కలిపినప్పుడు డీహైడ్రేషన్ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ కారణంగానే మరుసటి రోజు హ్యాంగోవర్ కూడా చాలా ఎక్కువగా ఉండి తలనొప్పి, వికారం వంటి లక్షణాలు తీవ్రంగా బాధిస్తాయి. కాబట్టి మద్యపానం చేసేటప్పుడు ఇలాంటి మిశ్రమాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా నీళ్లు లేదా ఐస్ ముక్కలు కలుపుకోవడం కొంతవరకు సురక్షితమైన మార్గమని సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

