Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Judge Awarded 23 Death Sentences | ఒక న్యాయమూర్తి ఆరు నెలల్లో 23 మంది నిందితులకు మరణశిక్షలు విధించారు. హత్యలకు సంబంధించిన 11 కేసుల్లో ఈ మేరకు తీర్పులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ జడ్జిని ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు.
లక్నో: ఒక న్యాయమూర్తి ఆరు నెలల్లో 23 మంది నిందితులకు మరణశిక్షలు విధించారు. హత్యలకు సంబంధించిన 11 కేసుల్లో ఈ మేరకు తీర్పులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ జడ్జిని ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేశారు. (Judge Awarded 23 Death Sentences) ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 11 కేసుల్లో 23 మందికి మరణశిక్షలు విధించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ముజఫర్‌నగర్‌లోని కుటుంబ న్యాయస్థానానికి జడ్జి రవి కుమార్ దివాకర్‌ను బదిలీ చేశారు. ఫ్యామిలీ కోర్టుకు అదనపు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనను నియమించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా శివ కుమారి బాధ్యతలు స్వీకరించనున్నారు.
కాగా, ఆగస్ట్‌లో అప్పటి జిల్లా, సెషన్స్ జడ్జి బి.కె. సింగ్ జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ద్వారా హత్య, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించి పాక్షికంగా విచారణలో ఉన్న 97 కేసులను తన కోర్టు నుంచి ఉపసంహరించుకోవడాన్ని న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ ఇటీవల ప్రశ్నించారు.
అలాగే సుమారు 10 ఏళ్ల నాటి ఎన్డిపిఎస్ కేసులో ఒక నిందితుడిని నిర్దోషిగా విడుదల చేశారు. చట్టం నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా, విచారణ ప్రారంభమైన కేసులను పరిపాలనా ఉత్తర్వుల ద్వారా ఉపసంహరించుకోవచ్చా అని 35 పేజీల తీర్పులో ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై, అలాగే జిల్లా న్యాయమూర్తులు వినియోగించే పరిపాలనాపరమైన అధికారాల పరిమితులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

