మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ముందు అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలికాడు. అయితే గాయాల కారణంగానే ప్యాటిన్సన్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తున్నది. 31 ఏండ్ల పాటిన్సన్ తన కెరీర్లో 21 టెస్టులు (81 వికెట్లు), 15 వన్డేలు (16 వికెట్లు), 4 టీ20(3వికెట్లు) ఆడాడు. ‘యాషెస్ సిరీస్‌కు ఆడాలని ఉంది. కానీ నేను టోర్నీకి సిద్ధంగా లేను. వందశాతం ఫిట్‌గా ఉంటేనే జట్టులో ఉండాలి. ఇక కుర్రాళ్లను క్రికెటర్లుగా తయారు చేసేందుకు మరింత సమయం కేటాయిస్తా’ అని పేర్కొన్నాడు. ప్యాటిన్సన్ జాతీయ జట్టుకు అందించిన సేవలను సెలెక్టర్స్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ కొనియాడాడు.