న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ ది రేంజ్ రోవర్ వెలార్ను పరిచయం చేసింది జేఎల్ఆర్. ఈ కారు ధరను రూ.94.3 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 2 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్తో రూపొందించిన ఈ కారు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద లభిస్తున్నదని కంపెనీ ఎండీ రాజన్ అంబా తెలిపారు.