బెంగళూర్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) జగదీష్ శెట్టార్‌కు పరాజయం తప్పదని బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప చేసిన వ్యాఖ్యలపై శెట్టార్ స్పందించారు. పార్టీ ఒత్తిడితోనే యడియూరప్ప ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఉత్తర కర్నాటకలో బీజేపీకి సీట్లు తగ్గుతాయనే భయం యడియూరప్పను వెంటాడుతోందని చెప్పారు.
ఓటమి భయంతో నైరాశ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని జగదీష్ శెట్టార్ ఎద్దేవా చేశారు. శెట్టార్ హుబ్లీ-ధర్వాడ్ సెంట్రల్ నుంచి విజయం సాధించకుండా బీజేపీ నేతలంతా కృషి చేస్తారని యడియూరప్ప హుబ్లీ ర్యాలీలో పేర్కొన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన శెట్టార్ ఆపై కాంగ్రెస్‌లో చేరారు. శెట్టార్, లక్ష్మణ్ సవది వంటి పలువురు లింగాయత్ నేతలు బీజేపీని వీడటంతో ఆ పార్టీ విజయావకాశాలు సన్నగిల్లాయని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా.. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఆసరగా అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ చెమటోడుస్తోంది. ఇక వొక్కలిగల మద్దతు అండగా కింగ్ మేకర్‌గా అవతరించేందుకు జేడీఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
Read More
Shelly Oberoi: ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక