సూర్యాపేట, సెప్టెంబర్ 28 : సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల పలు రకాల ప్రమాదాలు, అనారోగ్యంతో వైద్య సేవలు పొందిన 136 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో లబ్ధిదారులకు అయన సంబంధిత చెక్కులను అందజేశారు.