ముంబై, డిసెంబర్ 5: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఆదివారం ముంబై ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు కొంతసేపు అడ్డుకున్నారు. విచారణ అనంతరం ఆమెను విడిచిపెట్టారు. రూ.200 కోట్లకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసులో ఆమెపై ఈడీ ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీచేసింది. ఓ షోలో పాల్గొనే నిమిత్తం దుబాయ్ వెళ్లేందుకు ఫెర్నాండెజ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లగా అధికారులు ఆమెను ఆపారు.