ఒకే ఒక్కడు..
- బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు ఆరీఫ్‌ఖాన్ అర్హత

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బీజింగ్ వేదికగా జరుగనున్న వింటర్ ఒలింపిక్స్‌లో రెండు ఈవెంట్లకు భారత ఆల్పైన్ స్కీయర్ ఆరీఫ్ ఖాన్ అర్హత సాధించాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ ఇటీవల స్లాలోమ్ ఈవెంట్లో అర్హత పొంది ప్రత్యేకత చాటగా.. తాజాగా జెయింట్ స్లాలోమ్ ఈవెంట్లో కూడా అర్హత సాధించాడు. ఈ విషయాన్ని అతడి ప్రమోటర్ జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ప్రకటించింది. ‘స్లాలోమ్ ఈవెంట్లో అర్హత పొందిన అల్పైన్ స్కీయర్ ఆరిఫ్ ఖాన్ తాజాగా జియాంట్ స్లాలోమ్ ఈవెంట్లో కూడా అర్హత సాధించాడు’ అని జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. దుబాయ్ వేదికగా అల్పైన్ స్కీయింగ్ స్లాలోమ్ కేటగిరీలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్‌లో ఆరీఫ్ అర్హత పొందాడు. దీంతో ఫిబ్రవరి 4 నుంచి షురూ కానున్న బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో ఆరీఫ్ రెండు ఈవెంట్లలో పాల్గొననున్నాడు. బీజింగ్‌లో భారత్ తరఫున పాల్గొంటున్న ఆరీఫ్ స్వస్థలం జమ్ము కశ్మీర్‌లోని తన్మార్గ్. 100కు పైగా స్కీ ఈవెంట్స్‌లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించగా.. ఆరీఫ్ కొంతకాలంగా యూరప్‌లో శిక్షణ పొందుతున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

