వారాంతాల్లో లంచ్ కోసమో, డిన్నర్ కోసమో రెస్టారెంట్ బాట పట్టడం మామూలైంది. ఇంటిపట్టునే ఉన్నా.. ఫుడ్ ఆర్డర్ చేయడమూ వీకెండ్ వీక్నెస్గా మారింది. ప్రతి ముద్దకూ కేలరీల లెక్కలు వేసుకునేవాళ్లు వీకెండ్ లంచ్పార్టీ అనగానే తప్పించుకోవడానికి కుంటిసాకులు వెతుక్కుంటారు. శుచిగా వండి వడ్డించే పోషకాలతో కూడిన రుచికరమైన విందుకు రమ్మంటే ఎవరైనా రెక్కలు కట్టుకుని వాలాల్సిందే! అలాంటి రెస్టారెంట్లే ఇవీ!! ఒకసారి మీరూ ట్రై చేయండి.
యమ్మీ బీ: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటుంది. డెజర్ట్స్‌కు పెట్టింది పేరు. షుగర్ ఫ్రీ, మైదా ఫ్రీ కేకులు ఇక్కడ రుచి చూడొచ్చు. కృత్రిమ రంగులు ఉపయోగించరు. మిల్లెట్ వెరైటీలు టేస్ట్ చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
ఈశా లైఫ్ మహాముద్ర: జూబ్లీహిల్స్‌లోని ఈ రెస్టారెంట్ ప్రశాంతతకు చిరునామా. దక్షిణాది, ఉత్తరాది రుచులు ఆస్వాదించొచ్చు. చిరుధాన్యాల వంటకాలు ఇక్కడ ప్రత్యేకం. రాగి పాత్రల్లో సర్వ్ చేస్తారు.
సేజ్ ఫామ్ కేఫ్: జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ రెస్టారెంట్‌ను ‘ఫామ్ టు టేబుల్’ కాన్సెప్ట్‌తో నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన, ప్రొటీన్ రిచ్ ఫుడ్ ఇక్కడ రుచి చూడొచ్చు. ప్రొటీన్ పంచ్ సలాడ్, చిల్లీ పిజ్జా తప్పక ట్రై చేయాల్సిందే!