హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ప్రతిపక్ష పార్టీలకు సవాల్ ( Challenges ) విసరడం, పారిపోవడం వెన్నతో పెట్టిన విద్యా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శించారు.తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరి తోక ముడిచిన కాంగ్రెస్ మంత్రుల ( Congress Ministers ) డొల్లతనం బయటపడిందని , మంత్రులు పోలీసులను అడ్డంపెట్టుకొని పారిపోయారని ఆరోపించారు.
గతంలో సవాల్ చేసిన రేవంత్ రెడ్డి ప్రెస్‌క్లబ్‌ను కల్లు కాంపౌండ్‌తో పోల్చి పారిపోగా , కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మూడు నెలల్లోనే మల్కాజీగిరి ఎంపీగా పోటీ చేశారని ఎద్దేవా చేశారు.ఉద్యమం జరిగినప్పుడు గుర్తుకు రాని గన్‌పార్క్ కాంగ్రెస్ మంత్రులకు ఇప్పుడు గుర్తొచ్చిందా ? అంటు ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం వద్ద సమాధానం లేనప్పుడే ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేస్తారని మండిపడ్డారు. ఏదేని సమస్యపై రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడగానే బండి సంజయ్ తెరపైకి వస్తాడని, బండి సంజయ్ డిఫెన్స్ లో పడగానే ముఖ్యమంత్రి తెరపైకి వస్తాడని విమర్శించారు. అమృత్ టెండర్ లో ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి కుంభకోణంపై కేంద్రానికి లేఖ రాస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదని వేముల ప్రశ్నించారు.
బొగ్గు కుంభకోణం జరిగిందని కేంద్రానికి లేఖ రాస్తే ఇంతవరకు చర్యలే లేవని అన్నారు. కేటీఆర్ హరీష్ రావు సెగకు మంత్రులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని, .
ఇక ముందు ఇలాంటివి చాలా జరుగుతాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలతో సింగరేణిలో బొగ్గు మాయం పై మంత్రి భట్టి విజిలెన్స్ విచారణకు ఆదేశించారని వెల్లడించారు.