భారత్ క్లీన్‌స్వీప్ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్
- ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పతకాలన్నీ భారత షూటర్లు చేజిక్కించుకున్నారు. రిథమ్ సాంగ్వాన్ స్వర్ణం, మనూ భాకర్ రజతం, నామ్యా కపూర్ కాంస్యం కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన తుదిపోరులో రిథమ్ 31-26 తేడాతో మనూ భాకర్‌ను చిత్తు చేయగా.. కాంస్య పోరులో నామ్యా 16-10 తేడాతో మైఖేలా (జర్మనీ)ను ఓడించింది. క్వాలిఫికేషన్ రౌండ్లో రిథమ్ 588, మనూ 584, నామ్యా 583 స్కోర్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో శివమ్ దబాస్ రజతం కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ 20 పతకాలతో జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

