Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ సమీపిస్తుండడంతో దక్షిణాఫ్రికా బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. గత సీజన్లో రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నా.. ఈసారి టైటిల్ లక్ష్యంగా మంగళవారం లారా వొల్వార్డ్త్(Laura Wolvaardt) కెప్టెన్‌గా పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేసింది. పొట్టి ఫార్మాట్లో రాణిస్తున్న15 మందికి చోటు దక్కగా.. వీరిలో సీనియర్ పేసర్ షబ్నిం ఇస్మాయిల్(Shabnim Ismail) కూడా ఉంది. వరల్డ్‌కప్ కోసం వీడ్కోలు వెనక్కి తీసుకున్న ఆమె మెగా ఈవెంట్లో సఫారీ పేస్ దళాన్ని నడిపించనుంది.
అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని పట్టేసేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమవుతోంది. నిరుడు భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌లో అదిరే ఆటతో ఫైనల్ చేరినా.. అనూహ్యంగా తడబడిన సఫారీ సైన్యం.. ఈసారి టైటిల్ లక్ష్యంగా స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. అనుభవజ్ఞురాలైన లారా వొల్వార్డ్త్ కెప్టెన్సీలో పొట్టి ప్రపంచకప్‌ను తన్నుకుపోవడానికి వస్తోంది. వన్డే ప్రపంచకప్ ఆడిన చాలామందికి పొట్టి కప్ ఆడబోతున్నారు. కానీ, గత సీజన్లో సఫారీ టీమ్ ఫైనల్ చేరడంలో కీలకమైన అనెకే బాస్చ్ మాత్రం ఈ ఎడిషన్‌కు ఎంపికవ్వలేదు.
SQUAD ANNOUNCEMENT 🚨
The South African Women’s National Selection Panel has today confirmed the 15-player squad for the upcoming ICC Women’s T20 World Cup 2026, set to take place in England and Wales from 12 June – 05 July.
Aiming to continue inspiring the future… pic.twitter.com/ec8m2f7vT5
— Proteas Women (@ProteasWomenCSA) May 12, 2026
టాపార్డర్ బ్యాటర్లుగా తంజిమ్ బ్రిట్స్, డెర్క్సెన్, సునే లుస్ ఎంపికవ్వగా.. ఆల్రౌండర్లుగా మరినే కాప్, డీక్కెర్క్, చోలే ట్రయాన్లు చోటు సంపాదించారు. అండర్-19 కెప్టెన్ కైలా రెయ్న్కే తొలిసారి జాతీయ జట్టుకు ఆడనుండగా.. మూడేళ్ల క్రితం చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన షబ్నం ఇస్మాయిల్ యూటర్న్ తీసుకోవడంతో స్క్వాడ్‌లోకి వచ్చింది. ఇంగ్లండ్ వేదికగా జరిగే పొట్టి సంగ్రామంలో తను మరినే కాప్, డానే వాన్ నీకెర్క్, ఖాకతో కలిసి కొత్త బంతిని పంచుకోనుంది.
దక్షిణాఫ్రికా ప్రపంచకప్ స్క్వాడ్ : లారా వొల్వార్డ్త్(కెప్టెన్), తంజిమ్ బ్రిట్స్, నడినే డీక్లెర్క్, అనెరీ డెర్క్సెన్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), మరినే కాప్, సునే లుస్, కరాబొ మెసో(వికెట్ కీపర్), నొనుకులులెకో మలబా, కైలా రెయ్నకే, తుమి సెఖునే, చొలే ట్రయాన్, డాన్ వాన్ నీకెర్క్, షబ్నిం ఇస్మాయిల్, అయబొంగ ఖాకా.