Rahul Gandhi | అమృతకాలం విషకాలంగా మారింది.. నీట్ పరీక్ష రద్దుపై రాహుల్‌గాంధీ ఫైర్..!
Rahul Gandhi | కేంద్ర ప్రభుత్వం (Union Govt) నీట్ పరీక్ష (NEET exam) ను రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత, లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు 22 లక్షల మందికిపైగా విద్యార్థులు పడిన కష్టం, వారు కన్న కలలు బీజేపీ (BJP) సారథ్యంలోని అవినీతి వ్యవస్థవల్ల ఛిన్నాభిన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం (Union Govt) నీట్ పరీక్ష (NEET exam) ను రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత, లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు 22 లక్షల మందికిపైగా విద్యార్థులు పడిన కష్టం, వారు కన్న కలలు బీజేపీ (BJP) సారథ్యంలోని అవినీతి వ్యవస్థవల్ల ఛిన్నాభిన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ తన అధికారిక ‘ఎక్స్ (X)’ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. తన ఎక్స్ ఖాతాలో రాహుల్‌గాంధీ ఏమని రాసుకొచ్చారంటే..!
‘నీట్ పరీక్ష రద్దయ్యింది. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికిపైగా విద్యార్థుల కఠోర శ్రమ, త్యాగాలు, కలలు ఛిన్నాభిన్నమయ్యాయి. పిల్లల చదువు కోసం కొందరి తల్లిదండ్రులు రుణాలు తీసుకున్నారు. కొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఎన్నో రాత్రులు మేల్కొని ఉండి చదివారు. అందుకు వారికి దక్కిన ప్రతిఫలం ఏమిటంటే.. పేపర్ లీకేజీలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యా వ్యవస్థలో వ్యవస్థీకృతమైన అవినీతి. ఇది కేవలం వైఫల్యం కాదు. దేశ యువత భవిష్యత్తుపై జరిగిన నేరం. ప్రతిసారి పేపర్ మాఫియా ఎలాంటి శిక్షల్లేకుండా తప్పించుకు తిరుగుతుంటే.. నిజాయతీపరులైన విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారు’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
ఇప్పుడు అదే లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి, ఆర్థికపరమైన భారం, అస్థిరతను భరించాల్సి వస్తోందని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఒకరి తలరాతను వారి శ్రమతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తుంటే ఇక విద్యకు నిజమైన అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చెబుతున్న ‘అమృత్ కాలం’ ఇప్పుడు ‘విష కాలం’ గా మారిందని ఎద్దేవా చేశారు. నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఈ నెల 3న జరిగిన పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ఈ రద్దుపై పలు పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

