Tollywood News | నాని, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘ఎంసీఏ’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా అలరించాడు. భూమిక ఈ చిత్రంలో నానికి వదినగా నటించారు. కంటెంట్ పరంగా కాస్త డివైడ్ టాక్ వచ్చినా సాయి పల్లవి మహిమతో కమర్షియల్‌గా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
ప్రస్తుతం వేణు శ్రీరామ్ ‘తమ్ముడు’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం గ్లింప్స్‌ను విడుదల చేశారు. కుటుంబ భావోద్వేగాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కథకు గతంలో నాని ‘ఎంసీఏ’ సినిమా కథకు సంబంధం ఉంటుందని టాలీవుడ్లో టాక్. ‘తమ్ముడు’ చిత్రం అఫీషియల్‌గా ‘ఎంసీఏ’కు సీక్వెల్ అని ప్రకటించక పోయినా ఈ రెండు కథలకు, అందులోని పాత్రలకు లింక్ ఉంటుందని తెలిసింది.
ఎంసీఏ చిత్రం కథకు ‘తమ్ముడు’ కథకు లింక్ ఉంటుందనే ప్రచారం టాలీవుడ్లో జరుగుతోంది. అయితే చిత్ర యూనిట్ మాత్ర ఈ వార్తలను కొట్టి పారేస్తుంది. ఎంసీఏకు తమ్ముడు చిత్రాలకు ఎటువంటి సంబంధం లేదని, అదంతా ఫేక్ వార్తలు అని చెబుతోంది. తమ్ముడు చిత్రాన్ని మహా శివరాత్రికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు తన బ్యానర్లో రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్, వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం, విజయ్ దేవరకొండతో ఓ సినిమా, ఆశిష్‌తో సెల్పీష్ చిత్రాలను నిర్మిస్తున్నాడు. త్వరలోనే నితిన్, బలగం వేణు కలయికలో రూపొందనున్న ఎల్లమ్మ చిత్రానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు.