IRCTC Divya Dakshin Yatra | రూ. 14 వేలకే అరుణాచలం, మధురై ట్రిప్.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
IRCTC Dakshin Yatra : మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో అధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ (IRCTC) టూరిజం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
IRCTC Divya Dakshin Yatra : మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో అధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ (DIVYA DAKSHIN YATRA WITH JYOTIRLINGA) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో(Train Route) ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు.
దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ (DIVYA DAKSHIN YATRA WITH JYOTIRLINGA) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోండగా… ఆగస్టు 9, 23న ఈ ప్యాకేజీ (Tour Package)ని బుక్ చేసుకోవచ్చు. (ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు.. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం ముగిసిన అనంతరం అయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది). ఈ టూర్ ప్యాకేజీలో అరుణాచలం (Arunachalam), కన్యాకుమారి (Kanyakumari), మధురై (Madurai), రామేశ్వరం (Rameswaram), తంజావూరు (Tanjavur, తిరుచ్చి (Trichy), త్రివేండ్రం (Tiruvananthapuram) లాంటి అధ్యాత్మిక(Spiritual) ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ (Hyderabad Package) ప్రారంభం అవుతుండగా.. ఇది 8 రాత్రులు, 9 రోజులు కొనసాగుతుంది.
ఐఆర్సీటీసీ ‘జ్యోతిర్లింగ’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు హైదరాబాద్‌లో(Hyderabad) టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 12:00 గంటలకు ట్రైన్ బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 2: రెండో రోజు ఉదయం 7:00 గంటలకు తిరువణ్ణామలై రైల్వే స్టేషన్(Tiruvannamalai railway Station)కు చేరుకుంటారు. ఐఆర్సీటీసీ పికప్ చేసుకుని అరుణాచలం (Arunachalam)కి తీసుకెళుతుంది. అక్కడ ప్రసిద్ధి చెందిన అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం తిరిగి తిరువణ్ణామలై రైల్వేస్టేషన్‌కు చేరుకొని మధురై(madurai)కు బయలుదేరుతారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం 8 గంటలకు మధురై చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఆర్సీటీసీ పికప్ చేసుకుని బస్సులో రామేశ్వరం తీసుకెళుతుంది. తర్వాత రామేశ్వర ఆలయాన్ని (Rameshwaram Temple) దర్శించుకుంటారు. అనంతరం ధనుష్కోడి(Dhanushkodi)కి వెళ్లొచ్చు. (పర్యాటకులు సొంత ఖర్చులతోనే వెళ్లాలి). రాత్రికి రామేశ్వరంలో భోజనం, బస ఉంటుంది.
Day 4 : నాలుగో రోజు రామేశ్వరంలో లంచ్ చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. అనంతరం మధురైకు బస్సులో ప్రయాణమవుతారు. సాయంత్రం మీనాక్షి(Madurai Meenakshi Temple) అమ్మవారిని దర్శనం ఉంటుంది. దర్శన అనంతరం షాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత మధురై రైల్వే స్టేషన్‌కు చేరుకొని కన్యాకుమారి (Kanyakumari) బయలుదేరుతారు.
Day 5 : ఐదో రోజు కన్యాకుమారిలోని ప్రకృతి అందాలను చూడవచ్చు. తర్వాత వివేకానంద రాక్ మెమోరియల్ (Vivekananda Rock Memorial), గాంధీ మండపం (Gandhi Mandap) సందర్శన ఉంటుంది. సాయంత్రం సన్‌సెట్ పాయింట్లో సూర్యాస్తమయాన్ని వీక్షించొచ్చు. రాత్రికి కన్యాకుమారిలో భోజనం, బస ఉంటుంది.
Day 6 : ఆరో రోజు ఉదయమే హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. అక్కడ నుంచి కన్యాకుమారి రైల్వేస్టేషన్ చేరుకొని తిరువనంతపురం (కొచ్చువేలి) బయలుదేరుతారు. అక్కడే అల్పాహారం చేసి శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని (Padmanabhaswamy Temple) దర్శించుకుంటారు. తర్వాత కోవలం బీచ్ (Kovalam Beach) అందాలు చూస్తారు. అనంతరం కొచ్చువేలి (Kochuveli) రైల్వేస్టేషన్‌కు చేరుకొని తిరుచిరాపల్లి (Tiruchirapalli)కి జర్నీ ఉంటుంది.
Day 7 : ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటారు. ఉదయం టిఫిన్ చేసిన అనంతరం శ్రీరంగం ఆలయాన్ని (Srirangam Temple) సందర్శిస్తారు. అనంతరం తంజావూరు (Tamjavuru)కు బయలుదేరుతారు. అక్కడ తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని (Brihadeeswara Temple) దర్శించుకుంటారు. అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా తంజావూర్లో సికింద్రాబాద్ రైలు ఎక్కుతారు.
Day 8 : రోజంతా రైలులోనే ప్రయాణం ఉంటుంది.
Day 9 : తొమ్మిదో రోజు ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ ‘దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ’ టూర్ ప్యాకేజీ ధర
ఇక చార్జీల విషయానికి వస్తే.. ఎకానమీలో ఇద్దరు లేదా ముగ్గురు షేరింగ్ కోసం రూ.14,300. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ. 13,300 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్‌లో ట్విన్, ట్రిపుల్ షేరింగ్ రూ.21,900. 5-11 చిన్నారులకు రూ.20,800. కంఫర్ట్‌లో ఇద్దరు లేదా ముగ్గురు షేరింగ్ రూ.28,500. 5-11 చిన్నారులకు రూ.27,100గా ధర నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో దర్శనం. రైలు టికెట్లు, హోటల్లో వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) కవర్ అవుతాయి. ఏదైనా కారణంతో 15 రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఒక్కో టికెట్‌కు రూ.250 క్యాన్సిలేషన్ ఛార్జీగా ఐఆర్సీటీసీ నిర్ణయించింది.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

