Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Iran vs US | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తలు మళ్లీ తీవ్రస్థాయికి చేరేలా కనిపిస్తున్నాయి. ఈ వారాంతంలో ఇరాన్ (Iran) పై అమెరికా (USA) భీకర దాడులు చేసే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. టెహ్రాన్ (Tehran) తో ఎలాంటి ఒప్పందం కుదరకపోతే తాము మరోసారి సైనికచర్యకు దిగే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు.
Iran vs US : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తలు మళ్లీ తీవ్రస్థాయికి చేరేలా కనిపిస్తున్నాయి. ఈ వారాంతంలో ఇరాన్ (Iran) పై అమెరికా (USA) భీకర దాడులు చేసే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. టెహ్రాన్ (Tehran) తో ఎలాంటి ఒప్పందం కుదరకపోతే తాము మరోసారి సైనికచర్యకు దిగే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడా ర్యాలీ (Florida Rally) లో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పశ్చిమాసియాలో మరో చిన్నస్థాయి ఎపిక్ ఫ్యూరీ జరగొచ్చు’ అని ట్రంప్ ఆ ర్యాలీ సందర్భంగా హెచ్చరించారు. ఈ వారాంతంలో ఇరాన్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బారక్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యలు చేశారు. తొలుత వాటిని ట్రంప్ తోసిపుచ్చారు. ఆ దాడుల వ్యాఖ్యల గురించి తనకేమీ తెలియదని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు స్వయంగా ట్రంప్ కూడా దాడుల గురించి హింట్ ఇవ్వడం గమనార్హం. దాంతో పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఉత్కంఠగా మారాయి.
కాగా అమెరికా హెచ్చరికల వార్తలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. నిప్పుతో చెలగాటమాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. తమపై మరోసారి దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని సముద్రగర్భంలో ఉన్న కమ్యూనికేషన్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌పై దాడి జరిగితే ఇక ఎలాంటి హద్దులు ఉండవని.. కేబుళ్లు, మిలిటరీ స్థావరాలు వేటినీ వదలబోమని పేర్కొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట అమెరికా దాడులు చేసింది. అప్పటి నుంచి పశ్చిమాసియాలో ఏదో ఒక రూపంలో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

