Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Gopi Chand | మాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ‘సింగ’ అనే యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘సింగ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది.
Gopi Chand | మాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ‘సింగ’ అనే యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘సింగ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో ఈ ప్రాజెక్టుపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. గోపీచంద్ గతంలో విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లో ఆయన దూకుడైన రూపంతో ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన పోస్టర్ మరో ప్రత్యేకతను సంతరించుకుంది.
తాజా పోస్టర్లో గోపీచంద్ సైనికుడి పాత్రలో కనిపిస్తూ పవర్ఫుల్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆయన పాత్రలోని ఎమోషన్, యాక్షన్ నేపథ్యం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ పాత్ర ఎలా ఉండబోతోంది? కథలో ఎలాంటి మలుపులు ఉంటాయి? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో అనార్కలి నాజర్ టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఆసక్తికరమైన కథాంశం, భావోద్వేగాలతో కూడిన నాటకీయ అంశాలతో ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా చిత్రబృందం పనిచేస్తోంది.
దర్శకుడిగా వి. వెంకట్‌కు ఇది తొలి సినిమా కావడం, గోపీచంద్ సైనికుడి పాత్రలో కనిపించనుండటంతో ‘సింగ’పై ఆసక్తి నెలకొంది. సినిమా విడుదల తేదీతో పాటు ఇతర వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.ఈ సినిమా అప్డేట్స్ కోసం గోపిచంద్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

