Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Iran | బాలిస్టిక్ క్షిపణుల (Ballistic missiles) పరిధిపై విధించుకున్న 2,000 కిలోమీటర్ల స్వీయ పరిమితిని ఎత్తివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ప్రకటించింది. దాంతో మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను అభివృద్ధి చేసేదిశగా ఇరాన్ అడుగులు వేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Iran : బాలిస్టిక్ క్షిపణుల (Ballistic missiles) పరిధిపై విధించుకున్న 2,000 కిలోమీటర్ల స్వీయ పరిమితిని ఎత్తివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ప్రకటించింది. దాంతో మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను అభివృద్ధి చేసేదిశగా ఇరాన్ అడుగులు వేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) ల దాడులకు హద్దుల్లేని ప్రతిదాడులు చేద్దామని ఇరాన్ సేనలకు సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే ఇరాన్ తాజా ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్షిపణుల పరిధికి సంబంధించిన పరిమితులు తొలగిపోయాయని, ఈ సామర్థ్యాలను తాము ఆచరణలో ప్రదర్శిస్తామని జనరల్ హొస్సేన్ మొహెబ్బి మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా, 2,000 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లగల బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నట్లు అధికారిక సమాచారమేమీ లేదు. ఈ రెండు వేల కిలోమీటర్ల పరిధి కింద మొత్తం అరేబియా ద్వీపకల్పంతోపాటు ఈజిప్టులోని చాలావరకు భూభాగం, గ్రీస్, బాల్కన్‌లోని కొన్ని ప్రాంతాలు వస్తాయి.
అయితే ఇరాన్ తన అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన సాంకేతికతను ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల రూపకల్పనకు ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదని అమెరికా చెబుతున్నది. యెమెన్ రాజధాని సనా సమీపంలోని అల్-షరియా ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో 22 మంది మృతి చెందారని హౌతీ తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 30 మంది గాయపడ్డారని తెలిపింది. వారిలో చాలావరకు మహిళలు, చిన్నారులే ఉన్నారని పేర్కొన్నది.
సౌదీ అరేబియానే ఈ దాడులకు పాల్పడిందని ఆరోపించింది. దక్షిణ యెమెన్‌లోని ఓ మార్కెట్‌పై జరిగిన దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారని హౌతీలు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ దాడులు జరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

