Summer Movies| సమ్మర్ వచ్చిందంటే నిర్మాతలు వరస పెట్టి సినిమాలని రిలీజ్ చేస్తూ వస్తుంటారు. సమ్మర్లో యూత్ అంతా ఖాళీగా ఉంటారు కాబట్టి పెద్ద హీరోలు కూడా తమ సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఐపీఎల్ చేయబట్టి కాస్త వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. క్రికెట్.. సినిమాలని డామినేట్ చేస్తుంది. సినిమాల కన్నా క్రికెట్‌కే మొదటి ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్‌కి పోటీగా సినిమాలు రిలీజ్ చేస్తే ఇబ్బందుల్లో పడతాము ఏమోనని నిర్మాతలు కాస్త వెనక్కి తగ్గుతున్నారు. అయితే రిస్క్ చేసి కొందరు మాత్రం తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు.
వాటిలో నితిన్ రాబిన్ వుడ్, మ్యాడ్ 2, సిద్దు జాక్, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, ప్రియదర్శి సారంగపాణి జాతకం, విష్ణు కన్నప్ప, నాని హిట్ 3, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, రవితేజ మాస్ జాతర వంటి సినిమాలు ఉన్నాయి .. ఇవన్నీ కూడా సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చే సినిమాలే. మరి ఇవన్నీ క్రికెట్‌ని దాటి ప్రేక్షకులని థియేటర్స్‌కి తీసుకు వస్తాయా అనే లెక్కలు కూడా వేస్తున్నారు. ఎందుకంటే క్రికెట్ దారి క్రికెట్ దే, సినిమాల దారి సినిమాలదే అనే అభిప్రాయం కూడా ఉంది. క్రికెట్ సినిమాలపై ఎఫెక్ట్ చూపించదని కొందరు విశ్లేషకుల మాట.
క్రికెట్ ఎప్పుడో సాయంత్రం వస్తుంది. అందులో అందరికి అన్ని మ్యాచ్‌లు చూడాలని అనిపించదు. దాంతో సినిమా చూడాలనుకునే ఆడియన్స్ కి క్రికెట్ అడ్డంకిగా ఉండదని చెబుతుంటారు. అయితే ఇక్కడ కూడా ఓ కండీషన్ ఉంది. అదేంటంటే ముందు సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలి, యునానిమాస్ గా సినిమా బావుందనే టాక్ వస్తే సినిమాని ఇష్టపడే ఆడియన్స్ ఏదో ఒక షో ప్లాన్ చేసుకుని థియేటర్‌కి వెళ్లి చూస్తారు. యావరేజ్, బిలో యావరేజ్ అనే టాక్ వస్తే ఓటీటీలో చూసుకోవచ్చులే అన్నమైండ్ సెట్‌కి వెళ్లిపోతుంది. అప్పుడు సినిమాపై ఖచ్చితంగా ఐపీఎల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్, సెకండ్ షోలపై ఐపీఎల్ ఎఫెక్ట్ బలంగా ఉంటుందని మనం గట్టిగా చెప్పవచ్చు. చూడాలి ఈ సారి ఐపీఎల్‌కి ధీటుగా విడుదలయ్యే సినిమాలు ఎంత మంచి విజయం సాధిస్తాయా అన్నది.