ముంబై : క్రికెట్ అభిమానులకు మరో పండుగ రాబోతున్నది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ టోర్నీతో తడిసిముద్దయిన ఫ్యాన్స్‌కు మరింత మజాను అందించేందుకు ఐపీఎల్ సర్వహంగులతో రాబోతున్నది. పొట్టి ప్రపంచకప్ ఇలా ముగిసిందో లేదో మరో రెండు నెలల పాటు ఫ్యాన్స్‌ను అలరించేందుకు ఈనెల 28 నుంచి ఐపీఎల్ మొదలుకాబోతున్నది.
ఈ మేరకు లీగ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఐపీఎల్ అధికారిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. మే నెలాఖరు వరకు జరిగే అవకాశమున్న ఐపీఎల్ 19వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నది.