IPL 2023: ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, ధోనీ సేన ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 49 పరుగుల తేడాతో గెలిచింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా రహానే(71), శివం దూబే(50) వీర కొట్టుడు కొట్టడంతో చెన్నై 234 పరుగులు చేసింది. ఆ తర్వాత జేసన్ రాయ్(61), రింకూ సింగ్(53) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడినా సరిపోలేదు. కోల్‌కతాకు ఇది వరుసగా నాలుగో ఓటమి.
పథిరన వేసిన ఆఖరి ఓవర్లో 56 రన్స్ అవసరమయ్యాయి. తొలి బంతికి రింకూ సింగ్(53) సిక్స్ కొట్టి యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఫోర్ కొట్టాడు. లాంగాఫ్‌లో సిక్స్ బాదాడు. దాంతో చెన్నై 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది.. ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్(0)ను ఇంపాక్ట్ ప్లేయర్ ఆకాశ్ సింగ్ బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్లో మరో ఓపెనర్ జగదీశన్(1) ఔటయ్యాడు. కెప్టెన్ నితీశ్ రానా(27),ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(20) తక్కువకే ఔటయ్యారు. ఆ తర్వాత జేసన్ రాయ్(61), రింకూ సింగ్ ధాటిగా ఆడారు. రాయ్ ఔటయ్యాక ఆండ్రూ రస్సెల్(9), చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీశ్ థీక్షణ రెండు వికెట్లు తీశారు. ఆకాశ్ సింగ్, జడేజా, మోయిన్ అలీ తలా ఒక వికెట్ తీశారు.
ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, ధోనీ సేన ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 49 పరుగుల తేడాతో గెలిచింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా రహానే(71), శివం దూబే(50) వీర కొట్టుడు కొట్టడంతో చెన్నై 234 పరుగులు చేసింది. ఆ తర్వాత జేసన్ రాయ్(61), రింకూ సింగ్(53) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడినా సరిపోలేదు. కోల్‌కతాకు ఇది వరుసగా నాలుగో ఓటమి.
పథిరన వేసిన ఆఖరి ఓవర్లో 56 రన్స్ అవసరమయ్యాయి. తొలి బంతికి రింకూ సింగ్(53) సిక్స్ కొట్టి యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఫోర్ కొట్టాడు. లాంగాఫ్‌లో సిక్స్ బాదాడు. దాంతో చెన్నై 49 పరుగుల తేడాతో గెలుపొందింది.
భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది.. ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్(0)ను ఇంపాక్ట్ ప్లేయర్ ఆకాశ్ సింగ్ బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్లో మరో ఓపెనర్ జగదీశన్(1) ఔటయ్యాడు. కెప్టెన్ నితీశ్ రానా(27),ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(20) తక్కువకే ఔటయ్యారు. ఆ తర్వాత జేసన్ రాయ్(61), రింకూ సింగ్ ధాటిగా ఆడారు. రాయ్ ఔటయ్యాక ఆండ్రూ రస్సెల్(9), చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీశ్ థీక్షణ రెండు వికెట్లు తీశారు. ఆకాశ్ సింగ్, జడేజా, మోయిన్ అలీ తలా ఒక వికెట్ తీశారు.
ధోనీ రివ్యూ తీసుకోవడంతో కోల్‌కతా ఏడో వికెట్ పడింది. దేశ్‌పాండే బౌలింగ్‌లో డేవిడ్ వీస్(1) ఎల్బీగా ఔటయ్యాడు. రింకూ సింగ్(44) క్రీజులో ఉన్నాడు.
కోల్‌కతా ఆరో వికెట్ పడింది. పథిరన బౌలింగ్‌లో డేంజరస్ ఆండ్రూ రస్సెల్(9) ఔటయ్యాడు. రింకూ సింగ్(36) క్రీజులో ఉన్నాడు.
హాఫ్ సెంచరీ బాదిన జేసన్ రాయ్(61) ఔటయ్యాడు. థీక్షణ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దాంతో, కోల్‌కతా 135 రన్స్ వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. రింకూ సింగ్(21) క్రీజులో ఉన్నాడు.
జేసన్ రాయ్(51) హాఫ్ సెంచరీ కొట్టాడు. పథిరన ఓవర్లో సిక్స్ కొట్టి యాభై రన్స్ పూర్తి చేసుకున్నాడు. 19 బంత్లుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో అతను ఫిఫ్టీ సాధించాడు.
కోల్‌కతా బ్యాటర్లు దంచుతున్నారు. జడేజా ఓవర్లో జేసన్ రాయ్(33) సిక్స్, ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రింకూ సింగ్(10) లాంగాఫ్‌లో సిక్స్ బాదాడు. దాంతో 19 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు స్కోర్.. 95/4
జడేజా బిగ్ వికెట్ తీశాడు. నితీశ్ రానా(27)ను ఔట్ చేశాడు. ఫోర్ కొట్టిన రానా ఆ తర్వాతి బంతికి రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మోయిన్ అలీ బౌలింగ్‌లో జేసన్ రాయ్(19) హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టాడు. నితీశ్ రానా(23) క్రీజులో ఉన్నాడు. 8 ఓవర్లకు స్కోర్.. 66/3
కోల్‌కతా మూడో వికెట్ పడింది. మోయిన్ అలీ బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(20) ఎల్బీగా ఔటయ్యాడు. రివ్యూ తీసుకున్నా కూడా ఫలితం లేకపోవడంతో అయ్యర్ పెవిలియన్ చేరాడు. నితీశ్ రానా(22), క్రీజులో ఉన్నాడు. 7.1 ఓవర్లకు స్కోర్.. 46/3
3⃣ Reds and that is O.U.T ☝️
Venkatesh Iyer departs as Moeen Ali gets the third wicket for @ChennaiIPL 👊🏻
Follow the match ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/mQmktOFR1C
— IndianPremierLeague (@IPL) April 23, 2023
మహీశ్ థీక్షణ బౌలింగ్‌లో 5 పరుగులు వచ్చాయి. నితీశ్ రానా(16), వెంకటేశ్ అయ్యర్(18) క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లకు స్కోర్.. 38/2
తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో నితీశ్ రానా(10) థర్డ్ మ్యాన్ దిశగా ఫోర్ బాదాడు. వెంకటేశ్ అయ్యర్(11) క్రీజులో ఉన్నాడు. 4 ఓవర్లకు స్కోర్.. 24/2
కోల్‌కతా రెండో వికెట్ పడింది. ఓపెనర్ జగదీశన్(1) షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో జడేజా క్యాచ్ పట్టడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. వెంకటేశ్ అయ్యర్(0) క్రీజులో ఉన్నాడు.
కోల్‌కతాకు తొలి ఓవర్లోనే షాక్.. ఓపెనర్‌గా వచ్చిన సునీల్ నరైన్(0) బౌల్డయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఆకాశ్ సింగ్ నాలుగో బంతికి నరైన్‌ను బౌల్డ్ చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చాడు. జగదీశన్(1) ఆడుతున్నాడు.
Impact Player Akash Singh announces his arrival in style 😎
He uproots the off-stump to dismiss Sunil Narine early!
Follow the match ▶️ https://t.co/lHmH28IYPO#TATAIPL | #KKRvCSK pic.twitter.com/vU8WfILyLp
— IndianPremierLeague (@IPL) April 23, 2023
ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఏకంగా ముగ్గురు అర్థ శతకాలు బాదారు. ఓపెనర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా రహానే(37), శివం దూబే(50) సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించారు. దాంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు కొట్టింది. కోల్‌కతాకు 236 టార్గెట్ నిర్దేశించింది.
ఖెజ్రోలియా వేసిన 20వ ఓవర్లో రవీంద్ర జడేజా(18) దంచాడు. రెండు బంతుల్ని స్టాండ్స్‌కు తరలించాడు. ఆ తర్వాత బంతికి రింకూ సింగ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన ధోనీ(2) రెండు రన్స్ తీశాడు. దాంతో, 4 వికెట్ల నష్టానికి చెన్నై 235 పరుగులు చేసింది.
Half-centuries for both Ajinkya Rahane and Shivam Dube!@KKRiders finally break the dangerous partnership as
Kulwant Khejroliya gets Dube out ✅@ChennaiIPL nearing the 200-run mark!Follow the match ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/1vNxwsM7zH
— IndianPremierLeague (@IPL) April 23, 2023
టాస్ ఓడిన చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (35), డెవాన్ కాన్వే(56 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సుయాశ్ శర్మ విడదీశాడు. తన మొదటి ఓవర్లోనే రుతురాజ్‌ను బౌల్డ్ చేశాడు. అజింక్యా రహానే(71), శివం దూబే(50) సిక్సర్లతో విరుచుకుపడ్డారు. క్లాస్ ఆటతో అలరించిన రహానే కోల్‌కతా స్పిన్ త్రయాన్ని ఉతికి ఆరేశాడు. కోల్‌కతా బౌలర్లలో ఖేజ్రోలియా రెండు, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ తలా ఒక వికెట్తీశారు.
అజింక్యా రహానే(67) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. దాంతో, చెన్నై స్కోర్ 200 దాటింది.
ధనాధన్ ఆడుతున్న శివం దూబే(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఖేజ్రోలియా ఓవర్లో సిక్స్‌తో 50 రన్స్ సాధించాడు. ఆ తర్వాత బంతికి భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. అజింక్యా రహానే(51) ఆడుతున్నాడు.
అజింక్యా రహానే(51) అర్థ శతకం బాదాడు. ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతను 24 బంతుల్లోనే 4 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 50 రన్స్ కొట్టాడు. శివం దూబే(42) క్రీజులో ఉన్నాడు. 17 ఓవర్లకు స్కోర్.. 186/2
శివం దూబే(32) వీర బాదుడు బాదుతున్నాడు. డేవిడ్ వీస్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో చెన్నై స్కోర్ 150 దాటింది. అజింక్యా రహానే(37) క్రీజులో ఉన్నాడు. 15 ఓవర్లకు స్కోర్.. 160/2
FIFTY partnership off just 16 deliveries!@ajinkyarahane88 & @IamShivamDube eyeing a massive first-innings total in Kolkata 💪🏻
What do you think it will be?
Follow the match ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/WuOIzy7s9O
— IndianPremierLeague (@IPL) April 23, 2023
ఓపెనర్ డెవాన్ కాన్వే(50 : 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ కొట్టాడు. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో సింగిల్ తీసి యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. అజింక్యా రహానే(8) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 94/1
చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (35) బౌల్డ్ అయ్యాడు. దాంతో, 73 రన్స్ వద్ద చెన్నై మొదటి వికెట్ పడింది. డెవాన్ కాన్వే(38), అజింక్యా రహానే క్రీజులో ఉన్నారు. 7.3 ఓవర్లకు స్కోర్.. 73/1
సునీల్ నరైన్ ఓవర్లో 13 రన్స్ వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్ (35) ఆఖరి రెండు బాల్స్‌కు ఫోర్, సిక్స్ బాదాడు. డెవాన్ కాన్వే(37) క్రీజులో ఉన్నాడు. ఏడు ఓవర్లకు స్కోర్.. 72/0
పవర్ ప్లేలో చెన్నై ఓపెనర్లు దూకుడుగా ఆడారు. కుల్వంత్ ఖేజ్రోలియా ఓవర్లో డెవాన్ కాన్వే(31) ఫోర్, రుతురాజ్ గైక్వాడ్ (14) సిక్స్ బాదారు. దాంతో, స్కోర్ యాభై దాటింది. 6 ఓవర్లకు స్కోర్.. 59/0
చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే(31) దంచుతున్నాడు. డేవిడ్ వీస్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదాడు. రుతురాజ్ గైక్వాడ్ (14), క్రీజులో ఉన్నాడు. ఐదు ఓవర్లకు స్కోర్.. 45/0
A smooth start to the innings for @ChennaiIPL 👌🏻@Ruutu1331 & Devon Conway dealing in boundaries at the moment ✅
Follow the match ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/1FztCTfuye
— IndianPremierLeague (@IPL) April 23, 2023
చెన్నై 2 ఓవర్లకు 14 రన్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (7), డెవాన్ కాన్వే(7) క్రీజులో ఉన్నారు.
కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రానా టాస్ గెలిచాడు. ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.