న్యూఢిల్లీ: గత ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తిరిగి పుంజుకోవడానికి సిద్ధమైంది. జట్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రిటెన్షన్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌ను అంటిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ ఇప్పుడు సహాయ బృందంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో గురువారం వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేయగా.. దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డెయిల్ స్టెయిన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. జట్టుకు తొలి ట్రోఫీని అందించిన టామ్ మూడీని సన్‌రైజర్స్ ప్రధాన కోచ్‌గా తిరిగి తీసుకోగా.. భారత మాజీ ఆటగాడు హేమంగ్ బదానీ ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. సైమన్ కటిచ్ సహాయ కోచ్‌గా.. స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్‌తో అనుబంధం కొనసాగిస్తున్నట్లు హైదరాబాద్ తెలిపింది.
ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. జట్టును అన్ని విభాగాల్లో ధృడం చేసి వచ్చే సీజన్లో ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నది. ఇప్పటికే ముగ్గురిని రిటైన్ చేసుకున్న హైదరాబాద్ మెగావేలంలో స్టార్ ఆటగాళ్లను తీసుకోవాలనే ప్రణాళికతో ఉంది.