కథలో కొత్తదనం ఉండాలి!

‘ఈ ఏడాది విడుదలవుతున్న నా మూడో చిత్రమిది. ఓ వినూత్నమైన కథను దర్శకుడు అద్భుతంగా డీల్ చేశారు. కొత్త జోనర్స్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చేరువకావాలని ప్రయత్నిస్తున్నా’ అని అన్నారు యువ కథానాయకుడు తేజ సజ్జా. ఆయన కథానాయకుడిగా రామ్ మల్లిక్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘అద్భుతం’. చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మించారు. శివాని రాజశేఖర్ కథానాయిక. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ నెల 19న స్ట్రీమింగ్కానుంది. ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ ‘ఓ యూనివర్సల్ సమస్య వల్ల హీరోహీరోయిన్ ఇద్దరికి ఒకే ఫోన్ నెంబర్ ఉంటుంది. అది వాళ్ల పరిచయానికి కారణమవుతుంది. వారి ప్రేమాయణం ఎలాంటి మలుపులు తీసుకుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి కథ ఇది. ప్రేక్షకుల ఊహల్ని తలక్రిందులు చేస్తూ అనేక మలుపులతో కథ సాగుతుంది. ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించింది. హీరోగా కథకే నేను తొలి ప్రాధాన్యతనిస్తాను. కథలో నవ్యత ఉంటే ఎలాంటి సినిమా అయినా అంతిమంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే విషయాన్ని నమ్ముతాను. అందుకే కొత్త జోనర్స్ను ఎంచుకుంటూ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నా. అన్ని రకాల ఉద్వేగాలు కలబోసిన విలక్షణ ప్రేమకథగా ‘అద్భుతం’ మెప్పిస్తుంది’ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Adbhutham
- teja sajja
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

