ఖిలావరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ( Womens Day ) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా ( Corporator Uma ) , మాజీ కార్పొరేటర్ భైరవైన దామోదర్ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో సేవలందిస్తున్న ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆశా , అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న మహిళా డాక్టర్లను సన్మానించారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు అమూల్యమని ప్రశంసించారు.
అనంతరం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మహిళల స్వయం ఉపాధి కోసం అందించిన ఏడు కుట్టు మిషన్లను కార్పొరేటర్ అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు బండి శోభ, పోశాల అరుణ, ఇనుములసుజాత, మిట్టపెళ్లి కృష్ణవేణి, నలిగంటి రాధిక, శ్రీలత తదితరులు పాల్గొన్నారు .